ప్రమాద స్థలాల్లో సీపీ శ్వేత క్షేత్రస్థాయి పరిశీలన
ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలపై ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. రహదారిపై అవసరమైన చోట సూచిక బోర్డులు, హెచ్చరికలు, ఇతర భద్రతా చర్యలు చేపట్టే అంశాలను పరిశీలించాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.