హనుమకొండ: గోపాల్‌పూర్ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం ఉత్సవాలు ముగిసినా ఇంకా తొలగించలేదు. దీంతో ప్రధాన రహదారి మూసుకుపోయి స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మండపాన్ని తొలగించి రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.