🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 10:19 am Posted by : Telangana Gontuka

ఆస్తి కోసం తమ్ముడిని హతమార్చిన అన్న!

News Image
మంచిర్యాల: ఆస్తి వివాదంతో తమ్ముడిని హతమార్చేందుకు అన్న సుపారీ ఇచ్చిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకుల శ్రీనివాస్‌, రాజేష్‌ అన్నదమ్ములు. భూములు, ఇళ్ల స్థలాల విషయంలో వివాదాలు ఉండగా.. శ్రీనివాస్‌ను హతమార్చేందుకు రాజేష్‌ రూ.2 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. సమ్మయ్య, కిష్టస్వామి సహకారంతో ఈ నెల 20న శ్రీనివాస్‌ను గుప్తనిధుల తవ్వకాల పేరుతో సోమనపెల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొడ్డలితో దాడి చేసి హతమార్చినట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్‌తో దహనం చేసినట్లు వెల్లడించారు. మిస్సింగ్‌ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నికల్‌ ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలి, రెండు బైక్‌లు, సెల్‌ఫోన్‌, రూ.60 వేల నగదు, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.
🏠 Home