హైదరాబాద్: తెలంగాణలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించేలా పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.