హనుమకొండ: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో శనివారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఎన్.రవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇల్లందకు చెందిన యోగా గురువు పోశాల శ్రీనివాస్‌కు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యోగా సర్టిఫికెట్‌ను అదనపు కలెక్టర్ అందజేశారు. 25 ఏళ్లుగా సుమారు 200 పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యోగా శిక్షణ అందిస్తూ సేవలందిస్తున్న శ్రీనివాస్ సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఆయుష్ అధికారులు పాల్గొన్నారు.