విశాఖపట్నం: నగరానికి సమీపంలో ఉన్న రుషికొండ బీచ్ ప్రకృతి అందాలకు, సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. బంగారు వర్ణపు ఇసుక, నిర్మలమైన సముద్ర జలాలు, పచ్చని కొండల మధ్య ఈ బీచ్ ఆకట్టుకుంటుంది. అందుకే దీనిని ‘జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్’గా పిలుస్తారు. స్విమ్మింగ్, జెట్‌స్కీయింగ్, కయాకింగ్, పారాసెయిలింగ్, విండ్‌సర్ఫింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. సమీపంలోని టూరిజం కాంప్లెక్స్, కాటేజీలు సందర్శకులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి.