🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:51 pm Posted by : Telangana Gontuka

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

News Image
అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడన వ్యవస్థ ఏర్పడి వాయుగుండంగా బలపడుతోంది. ఉత్తర అండమాన్‌ సముద్రం, మయన్మార్‌ తీర ప్రాంతానికి ఆనుకుని ఏర్పడిన ఈ వ్యవస్థ రానున్న రోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్లు ఐఎండీ తాజా హెచ్చరికలు పేర్కొన్నాయి.
🏠 Home