🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:45 pm Posted by : Telangana Gontuka

బొప్పాయి కాయలో బొజ్జ గణపయ్య!

News Image
జనగామ : బొప్పాయి కాయలో గణపతి ఆకారం కనిపించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఘనపూర్‌ పట్టణానికి చెందిన ప్రతాపగిరి దంపతుల తోటలోని బొప్పాయి కాయలో తొండం, చెవులు, బొజ్జతో గణపతి ఆకారం స్పష్టంగా కనిపించింది. గతేడాది కూడా ఇదే తరహాలో వింత కనిపించగా, ఈ ఏడాది మళ్లీ పునరావృతం కావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కమిటీ సభ్యులు బొప్పాయి కాయకు తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
🏠 Home