జనగామ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి పిలుపుతో పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. డీసీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కడియం శ్రీహరి తదితరులు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు.