🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:37 pm Posted by : Telangana Gontuka

విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి: అకుల సతీష్‌

News Image
కుత్బుల్లాపూర్‌: సూరారం పాండు బస్తీలో నిర్వహిస్తున్న ఏవీ మోడల్‌ స్కూల్‌ అనుమతులు, గుర్తింపు, నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని అకుల సతీష్‌ కోరారు. ఈ మేరకు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ స్పందించి ఫిర్యాదును డీఈఓకు పంపి పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు, చెల్లుబాటు అయ్యే అనుమతులు లేవని విచారణలో తేలితే సీజ్‌ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు టీసీలు, విద్యా రికార్డులు, బోర్డు రిజిస్ట్రేషన్‌, పదో తరగతి పరీక్షల విషయంలో ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉపాధ్యాయురాలిపై అనుచిత ప్రవర్తన, ఆమె బంధువులపై దాడి ఆరోపణలపైనా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తల్లిదండ్రులు పాఠశాల గుర్తింపు, అనుమతులను నిర్ధారించుకున్న తర్వాతే పిల్లలను చేర్పించాలని సూచించారు.
🏠 Home