🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:35 pm Posted by : Telangana Gontuka

ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా గెజిట్‌ నోటిఫికేషన్‌

News Image
హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ శాసనసభ సచివాలయం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 26న జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌తో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 18న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసి, 2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని పేర్కొంది. అనంతరం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. గెజిట్‌ నోటిఫికేషన్‌తో ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఖాళీపై అసెంబ్లీ పరంగా అధికారిక ప్రక్రియ పూర్తయింది. తదుపరి ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంటుంది.
🏠 Home