🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:31 pm Posted by : Telangana Gontuka

11 మండలాల్లో 27,700 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం

News Image
మధిర: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమంలో భాగంగా మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ రెండు నెలలు పూర్తి చేసుకుంది. జూలై 27న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన ఈ కిచెన్‌ ద్వారా మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, వైరా, కొణిజర్ల, వేమ్సూరు, పెనుబల్లి, బోనకల్‌, కల్లూరు, చింతకాని, ముదిగొండ మండలాల్లోని 575 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 27,700 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సహకారంతో రూపొందించిన మెనూ ప్రకారం ఇడ్లీ-సాంబార్‌, పూరీ-ఆలూ కుర్మా, దోశ-చట్నీ, ఉప్మా, మిల్లెట్‌ ఇడ్లీ, బోండా వంటి అల్పాహారాన్ని అందిస్తున్నారు. రోజు విడిచి రోజు వేడి పాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కిచెన్‌లో గంటకు 5,400 ఇడ్లీలు, 3,600 పూరీలు, 2,000 దోశలు తయారు చేసే సామర్థ్యం ఉంది. హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
🏠 Home