🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 4:00 pm Posted by : Telangana Gontuka

విద్యార్థులను ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు: కలెక్టర్

News Image
జనగాం:పాలకుర్తి: పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సోమవారం జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ నెల 22న ఎలుకలు కరిచినట్లు వచ్చిన సమాచారంపై ఆరా తీశారు. విద్యార్థుల చేతులు, కాళ్లను పరిశీలించగా ఎలుకలు కరిచిన ఆనవాళ్లు కనిపించలేదని, వదంతులను నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు.పాఠశాలలో వంటశాల, భోజన గది, సరుకుల నిల్వ గది, మరుగుదొడ్లు, విద్యార్థుల గదులను పరిశీలించారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాలలోకి అనుమతించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home