రెఖ్య నాయక్ తండాకు ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలి
2018లో పునర్విభజన సమయంలో గ్రామసభ, ప్రజాభిప్రాయం లేకుండా సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని పోచమ్మ తండా పంచాయతీలో కలిపారని తెలిపారు. దీంతో తండా ప్రజలు ప్రభుత్వ సేవలు, అభివృద్ధి పనుల కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం తండాకు సంబంధించిన నిధులు వంజరపల్లి పంచాయతీలో జమ లేదా సర్దుబాటు అయినట్లు వెల్లడైందన్నారు. 2018 నుంచి నిధులపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, తండాకు అర్హమైన నిధులను అభివృద్ధికే వినియోగించాలని కోరారు. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయకపోతే చట్టబద్ధ మార్గాల్లో పోరాటం కొనసాగిస్తానని రేవంత్ రాథోడ్ తెలిపారు.