🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 2:44 pm Posted by : Telangana Gontuka

13 కిలోల జింక మాంసం పట్టివేత

News Image
రంగారెడ్డి: రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల్లో సుమారు 13 కిలోల జింక మాంసంతో పాటు వేటకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఎయిర్‌గన్‌ను గుర్తించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాంసం, ఎయిర్‌గన్‌, రెండు వాహనాలను సీజ్‌ చేశారు. జింకను ఎక్కడ వేటాడారు, మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.
🏠 Home