🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 2:24 pm Posted by : satla anil kumar

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్ట్ చేయాలి

News Image
హనుమకొండ, సెప్టెంబర్‌ 28: ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య డిమాండ్‌ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ నుంచి హనుమకొండ కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. అనంతరం సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఓటు చోరీపై కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని కడియం కావ్య తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home