వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మామునూర్ వద్ద లారీ ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు