🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 10:05 am Posted by : Telangana Gontuka

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు యత్నం

News Image
వరంగల్:నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. లింగాల లచ్చమ్మ ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి ఆధార్‌ కార్డు ఇస్తే అప్‌డేట్ చేస్తానని నమ్మబలికాడు. కార్డు తీసుకురావడానికి ఆమె పక్క గదిలోకి వెళ్తుండగా మెడలోని గొలుసును లాగాడు. లచ్చమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ క్రమంలో గొలుసు ఇంటి ముందు పడిపోవడంతో చోరీ తప్పింది. పోలీసులు విచారణ చేపట్టారు
🏠 Home