🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 9:47 am Posted by : satla anil kumar

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమరెడ్డి..?

News Image
వరంగల్ : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రాజకీయంగా పట్టున్న రాంరెడ్డి బ్రదర్స్ కుటుంబానికి చెందిన సర్వోత్తమరెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎంపిక కమిటీ సర్వోత్తమరెడ్డి పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్ కూడా టికెట్ కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది.
సర్వోత్తమరెడ్డి అభ్యర్థిత్వంపై జరుగుతున్న చర్చతో కాంగ్రెస్‌ వర్గాల్లో రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. పార్టీ అధిష్ఠానం అధికారికంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
🏠 Home