దేశ సేవ చేస్తూ.. క్రీడల్లోనూ సత్తా చాటిన వినయ్ యాదవ్
ప్రస్తుతం ఆర్మీలో సేవలందిస్తున్న వినయ్ యాదవ్ దేశ రక్షణ విధులు నిర్వహిస్తూనే క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో పతకం సాధించడం విశేషం. పేద కుటుంబం నుంచి ఎదిగి సాధించిన ఈ విజయం తల్లిదండ్రులకు, పెగడపల్లి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. వినయ్ యాదవ్‌ను గ్రామస్థులు, మండల ప్రజలు అభినందించారు.