హైదరాబాద్: మణికొండలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆరుగురు అనుమానితులు ప్రవేశించినట్లు సమాచారం. లేక్‌సైడ్ ఫెన్సింగ్‌ను కత్తిరించి సీ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై ఆయుధాలతో దాడికి యత్నించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.