🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 6:52 am Posted by : satla anil kumar

ఎల్‌నినో దెబ్బకు సీతాఫలం మాయం! వేలల్లో వర్షాలు కురవక తగ్గిన కాత

News Image
ఉమ్మడి వరంగల్ లో వర్ష ప్రభా పరిస్థితులు సీతాఫలం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో అడవులు, కొండ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సీతాఫలాలు మార్కెట్లకు తరలివచ్చేవి. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో చెట్లకు కాయలు తక్కువగా కాశాయి. దీంతో సీతాఫలం లభ్యత గణనీయంగా తగ్గింది మార్కెట్‌లో సీతాఫలాలకు డిమాండ్ ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి. కానీ కాయలు తక్కువగా లభిస్తుండటంతో రైతులు, గిరిజనులకు ఆశించిన ఆదాయం రావడం లేదు. వర్షాలు సకాలంలో కురవకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సీతాఫలం దిగుబడిపై ప్రభావం చూపాయని స్థానికులు చెబుతున్నారు.
🏠 Home