🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 9:25 pm Posted by : Telangana Gontuka

గిటార్‌కు హెల్మెట్ లేదని.. రూ.500 చలాన్!

News Image
బెంగళూరు: ఏఐ కెమెరా చేసిన పొరపాటుతో ఓ వ్యక్తికి రూ.500 చలాన్ పడింది. సౌవిక్ దత్తా తన భార్య ద్విచక్రవాహనంపై హెల్మెట్ ధరించి, వీపుకు గిటార్ తగిలించుకుని ఒంటరిగా ప్రయాణిస్తుండగా.. గిటార్‌ను వెనుక కూర్చున్న ప్రయాణికుడిగా ఏఐ కెమెరా గుర్తించింది. దీంతో ‘హెల్మెట్ లేకుండా పిలియన్ రైడింగ్’ అంటూ చలాన్ జారీ చేసింది. దీంతో ఆశ్చర్యపోయిన సౌవిక్ సోషల్ మీడియాలో పోస్టు చేసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశారు. స్పందించిన పోలీసులు చలాన్ సరిదిద్దేందుకు మెయిల్ చేయాలని సూచించారు.
🏠 Home