🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:58 pm Posted by : Telangana Gontuka

వక్ఫ్‌ హక్‌ బచావో తహ్రీక్‌ జేఏసీ చైర్మన్‌గా ఖాలిఖ్‌ తన్వీర్‌

News Image
వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా వక్ఫ్‌ & హక్‌ బచావో తహ్రీక్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) చైర్మన్‌గా ఎం.ఏ. ఖాలిఖ్‌ తన్వీర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ స్టేట్‌ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు, వక్ఫ్‌ & హక్‌ బచావో తహ్రీక్‌ రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌ అబ్దుల్‌ వాహబ్‌ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా మైనారిటీల సమన్వయ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్‌ వాహబ్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా చూడాలని అన్నారు. ఆస్తుల రికార్డుల పరిరక్షణ, ఆక్రమణలు, వివాదాలపై చట్టపరమైన చర్యలతో పాటు వాటిని చట్టబద్ధంగా అభివృద్ధి చేసి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక సంక్షేమానికి ఉపయోగపడే వనరులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వక్ఫ్‌ ఆస్తుల సర్వే నంబర్లు, విస్తీర్ణం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, వక్ఫ్‌ రికార్డులు, ఆక్రమణలు, న్యాయ వివాదాల వివరాలను పత్రబద్ధం చేసి సమగ్ర డేటాబేస్‌ రూపొందిస్తామని తెలిపారు. అవసరమైన చోట సర్వే, జీపీఎస్‌/జీఐఎస్‌ మ్యాపింగ్‌, డిజిటల్‌ డాక్యుమెంటేషన్‌ చేపడతామన్నారు. మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, పోటీ పరీక్షల కోచింగ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు యువత, మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. హక్కుల ఉల్లంఘనలపై చట్టపరమైన స్పందనకు జిల్లా స్థాయిలో లీగల్‌ రెస్పాన్స్‌ టీమ్‌, ఫిర్యాదుల డాక్యుమెంటేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ మైనారిటీ బడ్జెట్‌, సంక్షేమ పథకాల అమలుపైనా పర్యవేక్షణ చేపడతామని తెలిపారు.
🏠 Home