🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:56 pm Posted by : Telangana Gontuka

గంగాదేవిపల్లిని సందర్శించిన ఏఎస్‌సీఐ విద్యార్థుల బృందం

News Image
గీసుకొండ : హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) విద్యార్థుల బృందం ఆదివారం జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు పొందిన గంగాదేవిపల్లిని సందర్శించింది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ సస్టెయినబుల్‌ కలెక్టివ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో భాగంగా గ్రామాభివృద్ధి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించారు. పంచాయతీ పాలకమండలి, సబ్‌కమిటీల పనితీరు, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటైన కమ్యూనిటీ వాటర్‌ ప్లాంట్‌, శిక్షణ కేంద్రం, మహిళా సంఘాల పాత్ర, స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘం పనితీరును పరిశీలించారు. మహిళలు నిర్వహిస్తున్న పల్లినూనె మిల్లు, బుట్టల తయారీ, టీ దుకాణం, కూరగాయల దుకాణం, డెయిరీ ఫామ్‌, సిమెంట్‌–ఐరన్‌ షాప్‌తో పాటు ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్‌సీఐ ప్రతినిధులు అర్చన, అక్షర సంస్థ ప్రతినిధి అరవింద్‌కుమార్‌, సర్పంచ్‌ స్వరూప, రమేష్‌, కూసం లింగయ్య, సెర్ప్‌ కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ బొజ్జ సురేశ్‌, వీఓఏ జనార్ధన్‌, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home