వర్ధన్నపేట: నియోజకవర్గ పరిధిలోని కట్ర్యాల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ తీగల కుమారస్వామి గౌడ్ ఇటీవల మృతి చెందగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేడు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు బీరవెల్లి లింగమూర్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని ఆయనను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జు సంపత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ల కుమార్, రామోజీ కమ్మరిగూడెం తిరుపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.