ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడు, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ అంతిమయాత్ర శనివారం ఒంగోలులో జరిగింది. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ అంతిమయాత్రలో పాల్గొని రాజశేఖర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.