🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:36 pm Posted by : Telangana Gontuka

అక్టోబరు 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు!

News Image
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అధికమాసం వచ్చిన సందర్భాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు.
అక్టోబరు 11న రాత్రి 7 గంటలకు అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12న బంగారు తిరుచ్చి, పెద్దశేష వాహన సేవలు, 13న చిన్నశేష, హంస వాహనాలు, 14న సింహ, ముత్యపుపందిరి, 15న కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు జరుగుతాయి. 16న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 17న హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, రాత్రి గజ వాహన సేవలు ఉంటాయి. 18న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, 19న ఉదయం 7 గంటలకు స్వర్ణరథం, రాత్రి అశ్వ వాహనం నిర్వహిస్తారు. 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సాధారణంగా ఉదయం 8–10, రాత్రి 7–9 గంటల మధ్య వాహన సేవలు జరుగుతాయి. గరుడ వాహన సేవ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది.
🏠 Home