🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:32 pm Posted by : satla anil kumar

అక్రమ బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలి : గట్టు నరేష్‌గౌడ్‌

News Image
వరంగల్‌: అక్రమ బెల్ట్‌షాపులు, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని TGYS రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ గట్టు నరేష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు కత్తి చిరంజీవిగౌడ్‌ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ డీసీకి ఫిర్యాదు చేశారు. బెల్ట్‌షాపుల వల్ల గీత కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని, వారిపై జరుగుతున్న దాడులు, బెదిరింపులపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కానూరు రాకేష్‌గౌడ్‌, నాగపూరి వెంకటేష్‌గౌడ్‌, బండారి జనార్దన్‌గౌడ్‌, కల్లెపు రఘుగౌడ్‌, కత్తి వర్షిత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home