సిరిసిల్ల: ఈనెల 30న సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, ట్రాఫిక్, భద్రత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై నిర్వాహకులతో చర్చించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం సిరిసిల్లలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, శంకర్‌నాయక్, కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.