🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:26 pm Posted by : Telangana Gontuka

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నాగరాజు

News Image
హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేఆర్‌ నాగరాజు హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కోసం బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home