🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:12 pm Posted by : Telangana Gontuka

ఈగ మల్లేశంకు ఘన సత్కారం.. సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారం

News Image
హైదరాబాద్‌: రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన సంకీర్తన 14వ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్‌ అకాడమీ 22వ వార్షికోత్సవ వేడుకల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షుడు ఈగ మల్లేశంను ఘనంగా సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సంకీర్తన కల్చరల్‌ సొసైటీ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్‌ అకాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కళారంగానికి, సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి శాలువా, పూలమాలతో సత్కరించి ‘సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారం’ అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించడం ద్వారానే సాంస్కృతిక వైభవం నిలుస్తుందని అన్నారు. కళాకారుల సంక్షేమానికి మండలి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
🏠 Home