🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:05 pm Posted by : Telangana Gontuka

ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

News Image
తొర్రూరు: హ్యూమన్‌ రైట్స్‌ సోషల్‌ జస్టిస్‌ సోషల్‌ సర్వీస్‌ ఫర్‌ చేంజ్‌ ఆఫ్‌ ఇండియా తొర్రూరు డివిజన్‌ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా గెస్ట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మంగళపల్లి హుస్సేన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీ ఎంపీటీసీ జక్క మహబూబ్‌రెడ్డి, జక్క ప్రతిభారెడ్డి దంపతులు పాల్గొన్నారు. మేఘన, కొమ్ము ప్రకాష్‌, హర్షిత రాథోడ్‌, నితిన్‌ ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సన్మానించారు.
🏠 Home