🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:01 pm Posted by : Telangana Gontuka

అంత్యక్రియలకు తరలిస్తుండగా లేచి కూర్చున్న వృద్ధుడు

News Image
చందుర్తి: చనిపోయాడని వైద్యులు నిర్ధారించిన వృద్ధుడు అంత్యక్రియల కోసం తరలిస్తుండగా లేచి కూర్చున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం శంకరయ్య మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు.
జోగాపూర్‌ సమీపంలో ఉండగా శంకరయ్య అకస్మాత్తుగా లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అతడిని వేములవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తండ్రి మృతి వార్తతో గల్ఫ్‌ నుంచి బయల్దేరిన కుమారులకు ఈ విషయం ఊరటనిచ్చింది. శంకరయ్య బతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలివచ్చి శంకరయ్యను పరామర్శించారు.
🏠 Home