వర్ధన్నపేట: దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం, గ్రామాభివృద్ధికి అడప కనకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు అన్నారు. భగత్‌సింగ్ జయంతి, గ్రామదాత అడప కనకయ్య వర్ధంతి సందర్భంగా ఆదివారం అడప రాజు రక్తదానం చేసి నివాళులర్పించారు. గుడి, బడి నిర్మాణాలతో పాటు పేదలకు అండగా నిలిచిన కనకయ్య సేవాస్ఫూర్తిని స్మరించుకుంటూ రక్తదానం చేసినట్లు తెలిపారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.