🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 1:40 pm Posted by : satla anil kumar

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

News Image
హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్ పాల్గొని, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో బాపూజీ సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం హంటర్‌రోడ్ వీవర్స్ హాస్టల్‌లో రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట్ నారాయణను సన్మానించారు.
🏠 Home