🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:28 am Posted by : satla anil kumar

ఎయిర్‌పోర్ట్ పనుల్లో వేగం పెంచాలి – వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద

News Image
వరంగల్. విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని ఆమె పరిశీలించి, రన్‌వే, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. నిర్ణీత లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, ఎయిర్‌పోర్ట్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
🏠 Home