మహారాష్ట్ర : మహారాష్ట్రను కరువు కాటేస్తోంది. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకు రాష్ట్రంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఛత్రపతి సంభాజీనగర్, పుణే, నాసిక్ డివిజన్లలో 30 శాతం, నాగ్‌పూర్‌లో 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆరు జిల్లాల్లో ఏకంగా 50 శాతం లోటు నమోదైంది. వర్షాభావంతో ఖరీఫ్ సాగు దెబ్బతినడంతో సోయాబీన్, పత్తి, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు, కూలీలకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఫడ్నవిస్ తెలిపారు. పంట నష్టపరిహారం, కరువు సాయం కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు.