హైదరాబాద్: డేటింగ్ యాప్‌లో పరిచయమైన సైబర్ నేరగాళ్ల వలలో ఓ యువ లాయర్ చిక్కుకుని ఏకంగా రూ.4.91 కోట్లు పోగొట్టుకున్నాడు. నగరానికి చెందిన 27 ఏళ్ల న్యాయవాదికి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులు.. ప్రైవేట్ చాట్స్, వీడియో కాల్స్‌లోని సున్నితమైన సమాచారాన్ని బయటపెడతామని బెదిరించారు. బ్లాక్‌మెయిల్‌కు భయపడిన బాధితుడు 241 లావాదేవీల్లో రూ.4.91 కోట్లు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతాల్లోని నగదు ఖాళీ కావడంతో చివరకు తన ఫ్లాట్‌ను విక్రయించి మరీ డబ్బులు చెల్లించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని, బ్లాక్‌మెయిల్‌కు లొంగకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు.