తెలంగాణలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతం.. 13 మంది మృతి
డీజీపీ వివరాల ప్రకారం, నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొన్న కొత్తగూడెం ఎస్సై వెంకన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. సైబరాబాద్‌లోని పటాన్‌చెరులో ఆరుగురు యువకులు, ఖైరతాబాద్‌లో ఒకరు, నిర్మల్‌లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. డీజే శబ్ద కాలుష్యం కారణంగా కూడా కొందరు ఆరోగ్య సమస్యలకు గురై మృతి చెందినట్లు తెలిపారు.ఈ ఏడాది గణేష్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదు కాగా, ఇళ్లలో ఏర్పాటు చేసినవాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 3.5–4 లక్షల విగ్రహాలు ఉన్నట్లు అంచనా వేశారు. శుక్రవారం నాటికి 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, మిగిలిన వాటిని శనివారం ఉదయం వరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లో నిమజ్జన బందోబస్తుకు 25 వేల మందికి పైగా పోలీసులు, టీజీఎస్‌పీ, ఆర్‌ఏఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు. ప్రజలు డీజే శబ్దాలను తగ్గించి, పోలీసుల భద్రతా సూచనలు పాటించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.