🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 9:13 pm Posted by : satla anil kumar

వర్ధన్నపేట : సర్పంచుల ఫోరమ్ అధ్యక్షురాలిగా పావని యాకాంతం

News Image
వర్ధన్నపేట మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షురాలిగా వెంకట్రావుపల్లె సర్పంచ్ కుల్లా పావని యాకాంతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ధమ్మన్నపేట సర్పంచ్ దుబ్బా అంజయ్య ఎన్నికైనట్లు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ప్రకటించారు. ఈ సందర్భంగా పావని యాకాంతంను ఎమ్మెల్యే సన్మానించారు. మహిళకు ఫోరమ్ నాయకత్వ బాధ్యతలు దక్కడంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పావని యాకాంతం కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home