జగిత్యాల: జిల్లాలో లంచం తీసుకుంటూ సీడీపీవో పద్మ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000గా మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. సెప్టెంబర్ 26న కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి రూ.63,000 స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని పద్మను అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.