హైదరాబాద్: ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-Inservice Teachers-2026) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మూడు విడతల్లో CBT విధానంలో పరీక్ష నిర్వహించారు. 24,986 మంది దరఖాస్తు చేసుకోగా 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించారు. పేపర్-1లో 68.76%, పేపర్-2 గణితం, సైన్స్‌లో 73.60%, సోషల్ స్టడీస్‌లో 67% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను అధికారిక విద్యాశాఖ వెబ్‌సైట్, మీ-సేవ కేంద్రాల్లో పొందవచ్చని అధికారులు తెలిపారు.