వర్ధన్నపేట: మున్సిపాలిటీ పరిధిలోని 3, 10వ వార్డుల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బుర్ర కొమురమ్మ, గాయల బాబు కుటుంబాలను కౌన్సిలర్లు గుజ్జ వీరన్న, తుమ్మల అరుణ శ్రీధర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. గాయల బాబు కుటుంబానికి 50 కిలోల బియ్యం, కొమురమ్మ కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు తమ వంతు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో కొండేటి మాధవ్, సంపత్, తుమ్మల యాకయ్య, బిక్షపతి, కన్నం కుమారస్వామి, వీరస్వామి, కొండేటి శ్రీనివాస్, బాబు తదితరులు పాల్గొన్నారు.