ముంబై: ముంబైలోని చారిత్రక ‘తాజ్ మహల్ ప్యాలెస్’ హోటల్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2026 సంవత్సరానికి విడుదలైన ‘ది 50 బెస్ట్ హోటల్స్’ జాబితాలో 30వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 38వ స్థానంలో ఉన్న హోటల్ ఈసారి ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుంది. 1903లో ప్రారంభమైన ఈ హోటల్ ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ హోటల్‌గా నిలిచింది.