🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 4:59 pm Posted by : Telangana Gontuka

చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 4 సాధారణ ప్రసవాలు.. 4 సిజేరియన్లు

News Image
భద్రాద్రి కొత్తగూడెం: మారుమూల ప్రాంతమైన చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 8 ప్రసవాలు నిర్వహించారు. వీటిలో 4 సాధారణ ప్రసవాలు, 4 సిజేరియన్‌ ఆపరేషన్లు ఉన్నాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ వైద్య బృందం సేవలకు అంతరాయం లేకుండా ప్రసూతి సేవలు కొనసాగించింది.
జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందుతున్నాయి. DCHS డాక్టర్‌ జి. రవిబాబు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సాయి వర్ధన్‌ పర్యవేక్షణలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రావణి, అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌, ఓటీ, నర్సింగ్‌ సిబ్బంది సమష్టి కృషితో ప్రసవాలు విజయవంతంగా నిర్వహించారు.
🏠 Home