మహబూబాబాద్: కేసముద్రం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధులు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లో బీట్, వీఓపీ విధులను పటిష్టంగా నిర్వహించి స్థానిక సమస్యలు, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించాలన్నారు. రాత్రి గస్తీ పెంచాలని, డయల్ 112కు వేగంగా స్పందించాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.