🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 4:23 pm Posted by : Telangana Gontuka

భర్త డ్యాన్స్‌పై మనస్తాపం.. పురుగుల మందు తాగిన భార్య

News Image
మంచిర్యాల: పరాయి మహిళలతో భర్త డ్యాన్స్‌ చేశాడన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాసిపేట మండలం దొడ్డిగూడెంలో వెలుగుచూసింది. సోనాపూర్‌ బాదుగూడకు చెందిన సంధ్య(23)కి నాలుగేళ్ల క్రితం జంగుతో వివాహం జరిగింది. ఇటీవల గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో జంగు ఇతర మహిళలతో కలిసి డ్యాన్స్‌ చేసినట్లు సమాచారం.
తన ముందే భర్త ఇతర మహిళలతో డ్యాన్స్‌ చేయడాన్ని తట్టుకోలేక సంధ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
🏠 Home