హైదరాబాద్: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెలో పాల్గొననున్న నేపథ్యంలో ఖాతాదారులకు కొంత ఊరట లభించనుంది. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు నిర్ణయించిన ఉచిత పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించినా అదనపు రుసుము వసూలు చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. మూడు రోజులపాటు ఈ వెసులుబాటు అందుబాటులో ఉండనుంది.