🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 4:18 pm Posted by : satla anil kumar

నల్లబెల్లి : బాధిత కుటుంబానికి బిర్రు రాజు పరామర్శ

News Image
వర్ధన్నపేట: నల్లబెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు బిర్రు మహేందర్‌ తల్లి బుచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో కాంగ్రెస్‌ యువ నాయకుడు బిర్రు రాజు కుటుంబాన్ని పరామర్శించారు. బుచ్చమ్మ భర్త కొమురయ్య, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5 కిలోల నూనె అందజేసి అండగా నిలిచారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తాటికాయల దిలీప్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home